Pages

Tuesday, November 1, 2022

నేస్తం

నా కన్నీటిని తుడిచి ,నా పెదవులపై చిరునవ్వువై నా విజయానికి శిల్పివై ,నా గమనానికి దిక్సూచివై నా కంఠంలో శ్వాసవై , నా ఉహాకు లయవై నా సంతోషనికీ చిరునామవై, న్ను లాలించే లాలివై ప్రేమను పంచిన మిత్రమా, నా ప్రియానేస్తామా ఏమిచ్చి తీర్చగలను నీ రుణం ............................

Saturday, June 25, 2011

గాయాపడిన నా తెలంగాణ

  ప్రక్కనే గంగ పారుతుంటే గొంతులు తడి అరక 
  వంకరలు పోతున్న నల్గొండ పోరగాండ్లు 
  పంటచేలు తడవక కరవుకు కళ్ళు చాపి  వలసపట్టిన పాలమూరు 
  బొగ్గుబాయి గల్ఫ్ బతుకులు చేసి 
  ఉన్న ఉపాధితరవులను నరికేసి నిరుద్యోగాన్ని ఉసిగోల్పెనే 
  మెతుకుసీమ కరువుసీమ చేసి 
  హైదరాబాద్  భూములను చెరపట్టనే  వలస రాబందులు 
  పెద్దమనుషుల ఒప్పందపు సిరా తడి అరక ముందే తూట్లు పొడిచి నయవంచన చేసి
  ధృతరాష్ట్ర్ర కౌగిలిలో సమైక్యం అని హలహాలం చీమ్ముతూ
  కలిసుందాం అంటూ మోసం చేస్తున్నా విశాలాంధ్ర 
  నా తెలంగాణ సమైక్యంలో గాయాపడిన రుధిర వీణా 
  సమైక్యపు సంకెళ్ళు తెంచుకొని  ఆత్మగౌరవంకై
  గర్జిస్తున తెలంగాణ బిడ్డాలార మీకు సలాం

Saturday, May 21, 2011

సహచర్యం


 
                                        నా ప్రాయం నీ సొంతం,
                                        నీ సహచర్యం నా హృదయపు వాకిట నిశి లో శశి
                                        నీ సావాసం కావాలి నా పాలిట వసంతం..
                                        నీ హృదయం నేను అవ్వాలి అని
                                        నేను నీ జతై నీలో సగమై
                                        ఏడడుగులతో నీ వశమై
                                        నూరేళ్ళూ నీతో నా ప్రయణం సాగాలి అని...



Monday, April 18, 2011

ఓ చెలి నిన్ను చేరేది ఏనాడూ


చుట్టూ ఎందరు ఉన్న నీతో ఉన్న దూరం కరగారావాసం అయిందే

నీతో
ఉసులు ఆడకపోతే ఉపిరి ఆగినట్టు ఉంటుందే ..

నువ్వు
లేని యి క్షణాలు నాకు శతకోటి యుగాలయనే

యి
ఎడబాటు ఎన్నాళ్ళూ మనం ఏకం అయేది ఏనాడూ సఖి

మరణా మృదంగం


మరణా మృదంగం మ్రోగుతుంటే ఏదో తెలియని భయం

మృత్యు దేవత ఓడిలో చేరుతుంటే వద్ధని మారాం చేస్తున్న మనస్సు

అందరిని వదలి వెళ్ళలేని నా అనే ఆరాటం

ఎన్నో అనుభవాల ఙ్ఙపకాలో బందీనీ అయి ఇహలోక వ్యసనాలో చిక్కుకొని

అందరికి విషాదం అయి గుండెకొత మిగిల్చి యి శ్వాస వదిలేది ఎలా

యి సంఘర్షణలో వెన్నుచూపక తలపడి జయించి ...

మృతు దేవతా ఓడిలో స్వేచ్ఛాగా సేద తీరాలి అని

వీరమరణంకై ఎదురుచూస్తూ నా మనోవంఛా తీరే క్షణం కోసం వేచివున్న:)

నీ తోడు


నే మారవ లేకునా నీతో కలసి నడిచిన ఏడు అడుగులు

మధుర క్షణాలు గుర్తుకు వచ్చిప్పుడల్లా కలిగెను నా కంట చేమ్మ..

నీతో నే బతుకంటూ ఆనందపు ఝారి లో తేలుతుంటే ...

నువ్వు
ఒక్కసారిగా నన్ను వదలి స్వర్గానికి వెళ్లిపోయాక

నువ్వు
లేక ముల్లాపాన్పు పై శయనీస్తు నువ్వులేని ప్రాణపు తృణాన్నీ వదలి

నీ దగ్గరికి రావాలి అని ఆశగా ఎప్పుడు అగిపోదామా అని

నా చిన్నిగుండే ఎదురు చూస్తుంది :(

Thursday, January 21, 2010

హృదయ వేదన





హృదయాని తడిచి చుసిన ఎన్నో వెతలు

కన్నీటిని చుక్క కదిలించిన దాని వెనుక ఎన్నో కథలు

తీయ్యటి పలుకుల్లో ఎన్నో విషాదాలు

చిరునవ్వుల్లో దాగిన ఎన్నో గాయాలు

కన్నుల్లో
ఏదో తెలియని బెరుకు

మదిలో
ఎగిసే లావాను ఆపేదెలా

గాయాలకు కోతలకు స్వాంతన కలిగెదెల